Telugu Gateway
Andhra Pradesh

ఎమ్మెల్సీనా...లేక!

ఎమ్మెల్సీనా...లేక!
X

పి. హరిప్రసాద్. జనసేన పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రకటనలు అన్ని అధికారికంగా ఆయన పేరు మీదే వస్తున్నాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అది నిన్న మొన్నటి వరకు. కానీ కొద్ది రోజుల క్రితమే కూటమికి దక్కిన రెండు ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యదర్శిగా ఉన్న హరి ప్రసాద్ కు ఇప్పించుకున్నారు. ఆయన ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కూడా.

పెద్దల సభ సభ్యుడిగా ఎన్నికైన హరి ప్రసాద్ ను పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏదో ఒక మీడియా వ్యవహారాలు చూసే వ్యక్తిగా ...పక్కన నుంచోబెట్టుకోవటం వాళ్ళిద్దరికీ ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ చూసే వాళ్లకు మాత్రం ఇది ఏ మాత్రం సరైన సంకేతాలు పంపదు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఈ ఫోటో చూస్తే ప్రజలకు ఏమి సంకేతం వెళుతుందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. బయటకు కనిపించనంతవరకు లోపల లోపల జరిగే వ్యవహారాలు ఎవరిని పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ ఇలా బహిరంగంగా ఒక పెద్దల సభ సభ్యుడిగా..ఎమ్మెల్సీ గా ఎన్నికైన వ్యక్తితో ఏదో అర్జీలు తీసుకునే వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేయటం సరికాదు అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it