సోషల్ మీడియా లో హాట్ టాపిక్

రాజకీయాలతో సంబంధం ఉన్న వారు ఉన్నారు...అసలు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కడ వరకో ఎందుకు రాజధాని ఇక అమరావతి అనే ఫిక్స్ హైదరాబాద్ నుంచి వెళ్లిన సచివాలయ ఉద్యోగులు కూడా అక్కడ అప్పులు చేసి మరీ సొంత ఇల్లు , అపార్ట్ మెంట్ లు కొనుగోలు చేశారు. తర్వాత జగన్ సీఎం అయిన కొద్ది కాలానికి అమరావతి తూచ్ అంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి మొత్తం వ్యవహారాన్ని గందరగోళంలోకి నెట్టిన విషయం తెలిసిందే. జగన్ నిర్ణయం వల్ల రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వారు..ప్రభుత్వ ఉద్యోగులు కూడా నష్టపోయారు. రాజధాని నిర్ణయం మార్పు వల్ల ఇప్పటికే అమరావతి లో పెట్టిన వందల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా వృధాగా పోయినట్లు అయింది అనే చర్చ ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ అమరావతిలో తెలుగు దేశం నాయకులే వేల ఎకరాలు కొనుగోలు చేసి లబ్దిపొందటానికి ప్లాన్స్ వేసుకున్నారు అని విమర్శలు చేస్తుంటే...సీఎం జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన వైజాగ్ లో వైసీపీ నేతలు భూములు కొన్నారు అని టీడీపీ విమర్శలు చేస్తోంది. కానీ మధ్యలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారు అనే చర్చ కూడా ఉంది.