అనధికారికంగా ఎన్ ఆర్ ఐ కి కీలక బాధ్యతలు !

వైసీపీ హయాంలో ఐటి సలహాదారులుగా పని చేసిన వాళ్లే ఇప్పుడు లిక్కర్ స్కాం లో ఇరుక్కున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ నుంచే స్ఫూర్తి పొందినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే అసలు రెవిన్యూ శాఖ తో ఏ మాత్రం సంబంధము లేని ఒక ఎన్ ఆర్ఐ కి ఈ శాఖలో అత్యంత కీలకమైన ఫైల్స్ కియరెన్సు బాధ్యత అప్పగించింది. అయితే ఇది అంతా అనధికారికంగా సాగుతోంది అని చెపుతున్నారు. దీంతో ఆయన ఇప్పుడు ఆ శాఖలో హవా చెలాయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శాఖలో ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ రవి చూపు పడితే తప్ప ఏదీ ముందుకు కదిలే పరిస్థితి లేదు అన్నది ఆ శాఖ వర్గాలు చెపుతున్న మాట. ఆయన్ను రంగంలోకి దింపింది మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న అత్యంత కీలక మంత్రి. గత కొంత కాలంగా 22 ఏ భూములతో పాటు, పట్టణ ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన ఫైల్స్ ఆయన డీల్ చేస్తున్నట్లు ఆ శాఖ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇందులో అసలు సంగతి ఏమిటి అంటే రెవిన్యూ శాఖలోని అత్యున్నత స్థానాల్లో ఉండే అధికారులే స్వయంగా ఆయనతో చెప్పించుకుంటే తప్ప మీ పని కాదు తేల్చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని ఒక అధికారి తెలిపారు. రెవిన్యూ శాఖలోని రెండు కీలక స్థానాల్లోని పేషీల సిబ్బంది కూడా ఎవరి ఫైల్స్ అయితే తమ దగ్గరకు వచ్చాయో వాళ్ళకే ఫోన్లు చేసి మరీ ఎవరి దగ్గరకు వెలితే పని అవుతుందో చెపుతున్నారు అని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదే అదనుగా ఆ ఎన్ ఆర్ఐ ఇప్పుడు భారీ భారీ ల్యాండ్ డీల్స్ చేస్తున్నారు అని....ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా..మరికొన్ని వివిధ దశల్లో ఉన్నట్లు చెపుతున్నారు. ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, గుంటూరు, కాకినాడ వంటి ప్రాంతాల్లో భూముల కియరెన్సు కు సంబంధించి వీళ్ళు ఒక కొత్త మోడల్ ఫాలో అవుతున్నారు అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భూముల ఫైల్స్ తో పాటు వివిధ రకాల ఎన్ఓసి ఫైల్స్ కూడా ఉన్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక స్థానంలో ఒక మంత్రి గతంలో విదేశీ పర్యటనల సమయంలో ఆయన స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి ఆయన దృష్టిలో ఉన్నారు అని...అందుకే ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారినట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన చేసిన డీల్స్ వివరాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది అని ఒక అధికారి వెల్లడించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ ఫైల్స్ కియరెన్సు వ్యవహారంలో ఆ శాఖ మంత్రి పాత్ర అత్యంత పరిమితంగా ఉండటం.



