జగన్ సర్కారుకు షాక్..పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు ఓకే

పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వగా...దీన్ని ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ముందు ఛాలెంజ్ చేసింది. గురువారం నాడు డివిజన్ బెంచ్ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను గట్టిగా వ్యతిరేకించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతున్నందున ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని..అన్నింటి కంటే వ్యాక్సినేషన్ ముఖ్యం అని పేర్కొంది.
అంతే కాదు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపును కూడా కష్టం అని సర్కారు వాదిస్తూ వచ్చింది. అయితే ఎస్ఈసీ మాత్రం వ్యాక్సినేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని..ఎన్నికల నిర్వహణ ఆవశ్యకతను వివరించింది. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..సాఫీగా ఎన్నికలు జరిగే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం గురువారం నాడు తన ఆదేశాలు జారీ చేసింది.