ఫ్యూచర్ లో వాటాలు అమ్మేసిన హెరిటేజ్ ఫుడ్స్
BY Admin9 Dec 2020 4:37 PM IST
X
Admin9 Dec 2020 4:37 PM IST
ఫ్యూచర్ రిటైల్ లో తనకున్న మూడు శాతంపైగా వాటాలను హెరిటేజ్ ఫుడ్స్ అమ్మేసింది. ఈ అమ్మకం ద్వారా కంపెనీకి 132 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ నిధులను ముఖ్యంగా టర్మ్ రుణాల చెల్లింపునకు ఉపయోగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. హెరిటేజ్ ఫ్రెష్ ఔట్ లెట్లను గతంలో ఫ్యూచర్ రిటైల్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ లో భాగంగా హెరిటేజ్ కు ఫ్యూచర్ రిటైల్ షేర్లు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఫ్యూచర్ రిటైల్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హెరిటేజ్ ఫుడ్స్ తన వద్ద ఉన్న 1.78 కోట్ల వాటాలను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించినట్లు వెల్లడించింది. హెరిటేజ్ ఫుడ్స్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కుటుంబానికి సంబంధించినది అన్న విషయం తెలిసిందే.
Next Story