Telugu Gateway
Andhra Pradesh

నారా చంద్ర‌బాబు కంటే..సారా చంద్ర‌బాబే బెట‌ర్

నారా చంద్ర‌బాబు కంటే..సారా చంద్ర‌బాబే బెట‌ర్
X

అసెంబ్లీ వేదిక‌గా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో మ‌ద్యం బ్రాండ్ల‌కు సంబంధించి దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసే బ్రాండ్లు అన్నీకూడా చంద్ర‌బాబు అనుమ‌తించిన‌వే అన్నారు. త‌మ బ్రాండ్ దిశ‌, అమ్మ ఒడి అయితే..చంద్ర‌బాబు బ్రాండ్లే ఇవ‌న్నీ అన్నారు. చంద్ర‌బాబు ఇంటి పేరు నారా బ‌దులు సారా అని పెట్ట‌డ‌మే క‌రెక్ట్ అవుతుంద‌ని ఎద్దేవా చేశారు. బుధ‌వారం నాడు శాస‌న‌స‌భ‌లో మ‌ద్యం విధానంపై జ‌రిగిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌లో జ‌గ‌న్ ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఈ బ్రాండ్లను మేం క్రియేట్‌ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్‌ స్టేటస్‌, త్రీ క్యాపిటల్‌ అంటూ తప్పుడు లేబుల్స్‌తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్ తెలిపారు.'2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు.

మేం అమ్మే బ్రాండ్‌లన్నీ లైసెన్స్ డిస్టిలరీస్‌ నుంచి వచ్చినవే. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ , మరో వైపు ఎల్లో మీడియా ఇవే అసలు సిసలైన చీప్‌ బ్రాండ్స్‌. ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్‌ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్‌ కూడా చేసి ఉండొచ్చు కదా. వారు ఇచ్చిన లైసెన్స్‌డ్‌ డిస్టిలరీస్‌ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుంది?'' అని ప్రశ్నించారు . మా ప్రభుత్వం 16 మెడికల్‌ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్ త‌ప్పుప‌ట్టారు. టీడీపీ నేతలవి క్రిమినల్‌ బ్రెయిన్స్‌ అని, వాళ్లందరినీ జూలో పెట్టడమే కరెక్ట్ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పీఎంకే డిస్టిలరీస్‌ యనమల వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణ డిస్టిలరీస్‌ ఆదికేశవులనాయుడిది కాదా? విశాల డిస్టిలరీస్‌ ఎవరిది? అయ్యన పాత్రుడిది కాదా? అని సీ సీఎం జగన్ ప్ర‌శ్నించారు.

Next Story
Share it