Telugu Gateway
Andhra Pradesh

ఒకే జీవోలో రెండు నియామకాలు..ఈ రికార్డు చంద్రబాబుదే

ఒకే జీవోలో రెండు నియామకాలు..ఈ రికార్డు చంద్రబాబుదే
X

ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ. సాయి ప్రసాద్ రాష్ట్ర తదుపరి సీఎస్ కాబోతున్నారు. ఇది 2026 మార్చి ఒకటి నుంచి అమల్లోకి రానుంది. మరో వైపు ప్రస్తుత సిఎస్ విజయానంద్ పదవి కాలాన్ని మూడు నెలలు అంటే డిసెంబర్ ఒకటి నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన పదవి కాలం ముగిసిన వెంటనే తదుపరి సిఎస్ సాయి ప్రసాద్ బాధ్యత లు చేపడతారు. వాస్తవానికి ఒక సిఎస్ పొడిగింపు జీవోలో మరో సిఎస్ నియామకం ఉత్తర్వులు ఇవ్వరు. కానీ మరో సారి విజయానంద్ కు పొడిగింపు ఉండే అవకాశం ఉంది అని ప్రచారం జరిగే ఛాన్సులు ఉండటం...ఇప్పటికే మాట ఇచ్చి తప్పారు అనే విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి అన్నిటికి చెక్ పెడుతూ ఇలా ఇప్పించినట్లు ఉంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు సిఎస్ ల నియామకం విషయంలో ఇలాంటి జీవో ని ఇప్పించిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు కూడా అజయ్ కల్లామ్ ని సిఎస్ గా నియమించిన జీవో లోనే ఆయన తర్వాత దినేష్ కుమార్ సిఎస్ గా బాధ్యతలు చేపడతారు అని ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు విజయానంద్ ఎక్స్ టెన్షన్ తర్వాత సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు చేపడుతారు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రెండు రికార్డు లు కూడా చంద్రబాబు కే దక్కాయి. కేవలం సాయి ప్రసాద్ కు నమ్మకం కలిగించేందుకు ఇలా చేశారు అనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. ఎందుకంటే విజయానంద్ కు మూడు నెలల పొడిగింపు తర్వాత ఆయన కొంత అసంతృప్తికి గురయినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇవి అన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Next Story
Share it