'గాడ్ ఫాదర్ ' ఈవెంట్ పై వైసీపీ ప్రత్యేక ప్రేమ ఏమిటో?!
చిరంజీవిపై ఈ ప్రత్యేక ప్రేమకు కారణం ఏమిటో అన్న చర్చ సాగుతోంది. ఏపీలో పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. ఆదివారం నాడే మరో ప్రముఖ హీరో నాగార్జున ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కర్నూలులో జరిగింది. దీని గురించి మాత్రం విజయసాయిరెడ్డి ఎక్కడా ట్వీటినట్లు..మాట్లాడినట్లు దాఖలాలు లేవు. కానీ సెప్టెంబర్ 28న అనంతపురంలో జరగనున్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ప్రత్యేకంగా ట్వీట్ చేయటం అన్నది రాజకీయ చర్చకు కారణమైంది. వాస్తవానికి నాగార్జున వైఎస్ జామానా నుంచి కూడా ఆ ఫ్యామిలీతోనే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తమ వైపు ఉన్న నాగార్జున ఈవెంట్ నిర్వహిస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా..చిరంజీవి కార్యక్రమంపై ప్రేమ చూపించటం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇది అంతా కూడా చిరంజీవి అభిమానులను తమ వైపు తిప్పుకోవటం..లేదంటే అభిమానుల్లో గందరగోళం క్రియేట్ అన్నది వారి వ్యూహంగా చెబుతున్నారు.