Telugu Gateway
Andhra Pradesh

ఫన్ బకెట్ భార్గవ అరెస్ట్

ఫన్ బకెట్ భార్గవ అరెస్ట్
X

వీడియోలతో పాపులర్ కావటం. ఆ పాపులారిటీని అమ్మాయిలను వలలో వేసుకోవటానికి ఉపయోగించటం. అదే అదనుగా మోసం చేయటం. ఇప్పుడు కటకటాల్లోకి నెట్టింది ఓ టిక్ టాక్ స్టార్ ను. అతగాడే ఫన్ బకెట్ భార్గవ. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది షాక్ కు గురవుతున్నారు. ఏకంగా పధ్నాలుగు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని గర్భవతిని చేశాడు. చెల్లి చెల్లీ అంటూ పిలుస్తూ మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో బాధిత కుటుంబం పోలీసు కేసు పెట్టింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి భార్గవను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను అరెస్ట్ చేసినట్టు విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. చెల్లి అంటూ దగ్గరై టీవీ చానల్స్ లో అవకాశం ఇప్పిస్తానంటూ మైనర్‌తో అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ట్టు కూడా పోలీసులు గుర్తించారు.

ఈ మేరకు నిందితు నిపై అత్యాచారం తోపాటు ఫోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. టిక్ టాక్ భార్గవ్‌ ను హైదరాబాదులో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story
Share it