కలిసి పాలించటమా..కలిసి పంచుకోవటమా?

500 కోట్ల పెట్టుబడి..ఐదు వందల ఉద్యోగాలు అంట!
టీడీపీ కి చెందిన వాళ్లకు కొన్ని పవర్ ప్రాజెక్ట్ లు. జనసేన కు చెందిన వాళ్లకు కొన్ని పవర్ ప్రాజెక్ట్ లు. అలాగే టీడీపీ కి చెందిన వాళ్లకు చెందిన కొన్ని పరిశ్రమలకు భూముల కేటాయింపు. జనసేన కు చెందిన వాళ్ల కొన్ని పరిశ్రమలకు భూముల కేటాయింపు. కూటమి ప్రభుత్వం అంటే కలిసి పాలించటమా...కలిసి పంచుకోవటమా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కొత్తగా జనసేన కు చెందిన ఎంపీ బాలశౌరి కుమారుడికి చెందిన కంపెనీ అవిసా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ లో రాయితీ రేట్లపై 115 ఎకరాలు కేటాయించటానికి సిద్ధం అయింది. ఈ మేరకు ఎస్ఐపీసి రికమండ్ చేసింది. ఈ కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడి తో 500 మందికి ఉపాధి కల్పించనుంది వెల్లడించారు. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన ఎస్ ఐపీబి సమావేశంలో ఈ పెట్టుబడి ప్రతిపాదనకు ఓకే చేశారు. అయితే ఏ రేట్ కు భూమి కేటాయించారు అన్నది తేలాల్సి ఉంది.
ఈ కంపెనీకి అనుదీప్ వల్లభనేని మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటే...బాలకోటేశ్వర రావు సూడా అదనపు డైరెక్టర్ గా ఉన్నారు. అనుదీప్ వల్లభనేని జనసేన ఎంపీ బాలశౌరి కొడుకు. అంటే జనసేన ఎంపీ కుటుంబ సభ్యుల కంపెనీకి ప్రభుత్వం రాయితీ రేట్లపై భూమి ఇచ్చినట్లు అయింది. గురువారం నాటి సమావేశంలోనే ఆర్ విఆర్ ప్రాజెక్ట్స్ నంద్యాల లో ఏర్పాటు చేయనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కంపెనీ 4708 కోట్ల రూపాయల పెట్టుబడితో 1200 మందికి ఉపాధి అవకాశాలు కలిపిస్తుంది అని పేర్కొన్నారు. ఇది నవయుగా ఇంజనీరింగ్ అధినేత విశ్వేశ్వర్ రావు అల్లుడి కంపెనీ. ఈ కంపెనీకి అమరావతి లో కూడా ఏకంగా నాలుగువేల కోట్ల రూపాయల పైన కాంట్రాక్టులు కేటాయించారు. ఇది ఇలా ఉంటే ఎంపీ బాలశౌరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అని నెల్లూరు జిల్లాలో ఏపీఐఐసి నుంచి భూమి పొందారు. తర్వాత అయన ఈ ప్రాజెక్ట్ ను జిందాల్ పవర్ కు విక్రయించారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు కెనటా పవర్ కు కేటాయించిన భూమిని జిందాల్ కు బదిలీ చేయవద్దు అని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి లేఖ రాశారు. ఇప్పుడు ఆయనే బాలశౌరి తనయుడి కంపెనీకి కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ లో భూమి కేటాయించటానికి నిర్ణయం తీసుకున్నారు.



