Telugu Gateway
Andhra Pradesh

అద‌న‌పు ఆదాయాల‌పై ఫోక‌స్ పెట్టండి

అద‌న‌పు ఆదాయాల‌పై ఫోక‌స్ పెట్టండి
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు అద‌న‌పు ఆదాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై ఫోక‌స్ పెట్టింది. ఇప్పటికే భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం అద‌నంగా సొంత వ‌నరులు పెంచుకోవ‌టం ఎలా అనే అంశంపై దృష్టి సారించింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం నాడు ఆదాయార్జ‌న శాఖ‌ల మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. అదనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు​ సీఎం ఆదేశించారు. ఎస్‌ఓఆర్‌(రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలన్నారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని.. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి దృష్టిపెట్టాలని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలి. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలి. పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలి. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్‌ సేవలను సమీక్షించి... తగిన మార్పులు, చేర్పులు చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదు. ఆ మేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

Next Story
Share it