కర్నూలు విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభం
BY Admin28 March 2021 7:52 AM

X
Admin28 March 2021 7:53 AM
ఏపీలోని మరో విమానాశ్రయంలో ఆదివారం నాడు వాణిజ్య సర్వీసులు ప్రారంభం అయ్యా యి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. బెంగుళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. ఆదివారం ఉదయం 10:30కి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక మూడు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది.
Next Story