Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోనూ ఒమిక్రాన్ కేసు న‌మోదు

ఏపీలోనూ ఒమిక్రాన్ కేసు న‌మోదు
X

తొలి కేసు. ఏపీలోనూ ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చేసింది. అయితే ఇది కొంత మంది భ‌య‌పెడుతున్నట్లు భ‌యంక‌ర‌మైన వైర‌స్ ఏమీకాద‌ని..ఈ వైర‌స్ సోకిన వారికి నామ‌మాత్ర‌పు ల‌క్షణాలు మాత్రమే క‌న్పిస్తున్నాయ‌ని నిపుణులు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే దీనికి వేగంగా విస్త‌రించే ల‌క్షణం ఉండ‌టం ఒక్క‌టే ఒకింత ఆందోళ‌న‌క‌రం అంటున్నారు. అదే స‌మ‌యంలో భార‌త్ లో ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద‌గా ప్ర‌భావం చూపించే అవ‌కాశంలేద‌నే సంకేతాలు అందుతున్నాయి. అయితే ఏపీలోని విజ‌య‌న‌ర‌రం జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి ఒమిక్రాన్ వేరియంట్ వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధారించారు. అయితే భాదితుడికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు, శ‌నివారం నాడు నిర్వ‌హించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ లో నెగిటివ్‌ రిపోర్ట్ వ‌చ్చింద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన 34 ఏళ్ళ యువకుడికి ఒమిక్రాన్‌ గా నిర్ధారణ అయింద‌న్నారు.

ముంబ‌య్ విమానాశ్ర‌యంలో జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో యువకుడు నవంబర్‌ 27న విశాఖ చేరుకున్నాడు. విశాఖలో మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే హైదరాబాద్‌ సీసీఎంబీలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయడంతో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన‌ట్లు వైద్య శాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 15 మందికి కోవిడ్‌ పాజిటివ్ గా తేలింది. ఈ శ్యాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా 10 మందిలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింద‌ని..ప్రజలు ఎలాంటి భయందోళనలకు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. సోషల్‌ డిస్టెన్సింగ్ పాటిస్తూ మాస్కులు ధరించండి, చేతులు తరచూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.

Next Story
Share it