Telugu Gateway
Andhra Pradesh

అంతా ఒక ప్లాన్ ప్రకారమేనా!

అంతా ఒక ప్లాన్ ప్రకారమేనా!
X

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కి వివిధ రంగాలకు చెందిన సంస్థల ను ఆహ్వానిస్తూ ఏపీసిఆర్ డీఏ తాజాగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సినిమా, టీవీ ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటితో పాటు డిజిటల్ మీడియా ఇన్నోవేటర్స్, మీడియా విద్యా సంస్థల ఏర్పాటు వంటి వ్యాపారాలు ప్రారంభించటాని ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతిలో మెడికల్ కాలేజీలతో పాటు బయో టెక్ కంపెనీలు, వెల్నెస్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వంటి సంస్థలను కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. వీటితో పాటు కో వర్కింగ్ ఇండస్ట్రీ ..ఇందులో డెవలపర్లు, ఆపరేటర్స్, ఇన్వెస్టర్స్, టెక్నాలజీ పార్టనర్స్ ను కూడా ఆహ్వానించారు. వివిధ సంస్థలకు చెందిన వాళ్ళు ఒకే చోట పనిచేసుకునే వెసులుబాటు కలిపించే ప్రాంతాన్నే కో వర్కింగ్ ఇండస్ట్రీగా వ్యవహరిస్తారు.

ఆసక్తి ఉన్న కంపెనీలు జూన్ 24 వ తేదీ వరకు తమ బిడ్స్ సమర్పించవచ్చు అని సిఆర్ డీఏ కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ఎంపిక చేసిన టీవీ సంస్థలకు మాత్రమే అమరావతిలో స్థలాలు ఇస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారమే ఈ నోటిఫికేషన్ జారీ చేసి...బిడ్స్ పిలిచి మరీ అమరావతిలో భూములు కేటాయిస్తే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఈ మోడల్ ను ఎంచుకున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇదే ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలకు విద్యుత్ ప్రాజెక్ట్ లకు ఎలాంటి బిడ్స్ లేకుండా అలా దరఖాస్తు చేసుకుంటే చాలు..ఇలా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవి అన్ని కూడా అధికారంలో ఉన్న పెద్దలకు చెందిన అస్మదీయ కంపెనీలే కావటం మరో విశేషం. కానీ ఇప్పుడు మాత్రం పద్ధతిగా ముందు నోటిఫికేషన్ జారీ చేసి పని కానిస్తున్నారు అంటే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకే అన్న చర్చ తెర మీదకు వచ్చింది. అనధికారికంగా ఇప్పటికే ఎవరికీ భూములు ఇవ్వాలి అనే విషయం ఫిక్స్ అయిపొయింది అని...ఇది అంతా ఫార్మాలిటీ మాత్రమే అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. అయితే ఈ పేర్లు బయటకు వచ్చిన తర్వాత కానీ అసలు సంగతి ఏంటో బయటకు వస్తుంది అన్నారు. అయితే అమరావతి ఒరిజినల్ ప్లాన్ లో కూడా మీడియా సిటీ ఒకటి ఉంది.

Next Story
Share it