Telugu Gateway
Andhra Pradesh

పోలీసుల మీద కేసులు పెడ్డండి..వాళ్లే కాళ్ల బేరానికి వస్తారు

పోలీసుల మీద కేసులు పెడ్డండి..వాళ్లే కాళ్ల  బేరానికి వస్తారు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 'తప్పుడు కేసులు పెడితే మీరు కూడా ఓ ఐదారుగురు పోలీసులు మీద కేసులు పెట్టండి. అప్పుడు వాళ్ళే మీ కాళ్ళ బేరానికి వస్తారు. తప్పుడు కేసులు పెట్టడం మానేసి మీ కాళ్ల బేరానికి వస్తారు.ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా చెబుతున్నా. మన మీద కేసు పెడతున్నారని మీరు సైలంట్ గా ఉండటం కంటే ఈక్వల్ అమౌంట్ గా కేసులు పెట్టడండి. వాళ్ళు ఒకటి పెడితే మీరు రెండు పెట్టండి కావాలంటే.

ఒక వేళ వాళ్లు తీసుకోలేదంటే ఆన్ లైన్ లో పంపండి. రిజిస్టర్ చేయండి. ఎవ్రీ డే..ఇక్కడ డీజీపీ ఊదరగొడుతున్నాడు. మేం టెక్నాలజీలో నెంబర్ అని అని. ఆ టెక్నాలజీ వాడుకోండి. రిజిస్టర్ చేయండి. ఎననాలెడ్జ్ మెంట్ తీసుకోండి. ఎవడైనా తప్పు చేస్తే ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మనం వస్తూనే అన్నీ ఓపెన్ చేస్తాం. వన్ ఆర్ టూ ఇయర్స్ లో వీళ్ళు అందరినీ పనిష్ చేస్తాం. ఆ మెసేజ్ కూడా ఇవ్వండి. నీ మీద కేసు పెడుతున్నాం. కొన్ని కోర్టుకు వెళతాం. కొన్ని రిజిస్టర్ చేయద్దాం. ఎప్పుడు అవకాశం వస్తే అప్పడు అది చేద్దాం. అధైర్య పడకుండా ముందుకు వెళ్ళాలి. పార్టీ ఎక్కడికి అక్కడ యాక్టివ్ కావాలి. ' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it