Telugu Gateway
Andhra Pradesh

నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా అరెస్ట్ చేస్తారు

నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా అరెస్ట్ చేస్తారు
X

మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్ పై ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు స్పందించారు.నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా అరెస్ట్ చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. జగన్మోహ‌న్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు అని ఆయన ఆరోపించారు. నారాయ‌ణ అరెస్ట్ పై అచ్చెన్నాయుడు స్పంద‌న ఇలా ఉంది.' మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు.

ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు?. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారు. అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదు.' అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it