Top
Telugu Gateway

కళా వెంకట్రావు అరెస్ట్

కళా వెంకట్రావు అరెస్ట్
X

ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు రామతీర్ధం పర్యటన సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై జరిగిన దాడికి సంబంధించిన అంశంపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.అందులో భాగంగానే కళా వెంకట్రావును అరెస్ట్ చేసినట్లు సమాచారం.

బుధవారం రాత్రి రాజాంలోని కళా వెంకట్రావు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. దీంతో కళావెంకట్రావు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కళా వెంకట్రావు నివాసానికి భారీగా చేరుకున్నారు. పోలీసుల చర్యను ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story
Share it