Telugu Gateway
Andhra Pradesh

అయ్య‌న్న ఇంటిగోడ కూల్చివేత‌...ఉద్రిక్త‌త‌

అయ్య‌న్న ఇంటిగోడ కూల్చివేత‌...ఉద్రిక్త‌త‌
X

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు గ‌త కొంత కాలంగా సీఎం జ‌గ‌న్ పై..వైసీపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తున్నారు. కొన్నిసార్లు పరుష వ్యాఖ్య‌లు చేస్తుండ‌టంతో వైసీపీ ఆయ‌న్ను టార్గెట్ చేసుకుంది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. తాజాగా ఆయ‌న ఇంటి గోడ‌ను అధికారులు కూల్చేశారు. ఇది ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. అయితే ఈ గోడ ప్ర‌భుత్వ స్థ‌లాన్ని క‌బ్జా చేసి గోడ క‌ట్టార‌ని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే క‌నీసం నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా కూల్చేస్తార‌న్న‌ది టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌. పాత తేదీల‌తో ఇప్ప‌టికిప్పుడు నోటీసులు ఇచ్చి అర్ధారాత్రి కూల్చివేత‌లు చేశార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

దీంతో నర్సీపట్నంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‎పై అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్న రాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఆయ‌న్ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్ని అనుమ‌తులు ఉన్నా కూడా గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లే దారులని పోలీసులు మొత్తం మూసివేశారు. అయ్య‌న్న‌పాత్రుడి ఇంటి గోడ కూల్చ‌టంపై టీడీపీ నేతలు మండిప‌డ‌తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసుకుని మ‌రీ బీసీ నేత‌లను వేధిస్తోంద‌ని వీరు ఆరోపిస్తున్నారు.

Next Story
Share it