లక్ష్మీనారాయణకు ముందస్తు బెయిల్
ఏపీలో గత కొన్ని రోజులుగా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ దుమారం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారుల సోదాలు..కేసులు..అరెస్ట్ లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. తర్వాత విచారణకు రావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణ సమయంలోనే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రి పాలు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో లక్ష్మీనారాయణ ఏ2గా ఉన్నారు. తాజాగా ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది. సుమారు అరగంటపాటు విచారించిన ఏపీ హైకోర్టు 15 రోజుల ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం లక్ష్మీనారాయణ స్టార్ ఆస్పత్రిలో ఉన్నారు. ఈ స్కామ్ లో వందల కోట్లు షెల్ కంపెనీలకు తరలించారని సీఐడీ వాదనగా ఉంది.