Telugu Gateway
Andhra Pradesh

జగన్ ను ఇరకాటంలోకి నెట్టిన ధర్మాన !

జగన్ ను ఇరకాటంలోకి నెట్టిన ధర్మాన !
X

ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత..రాష్ట్ర మంత్రి. అయన గత కొంత కాలంగా మాట్లాడుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశగా మారింది. ఒక వైపు ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాలని ప్రజలంతా కోరుకుంటూన్నారు అంటారు. మళ్లీ ఆయనే ఈ విషయంలో సీఎం జగన్ కు మద్దతు ఇవ్వటానికి మీకు ఏంటి బాధ అంటూ ప్రజలను ఆయనే ప్రశ్నిస్తారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ధర్మాన ప్రసాద రావు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అయన మూడు రాజధానులకి సంబంధించి చేసిన ప్రకటన ఇప్పడు అత్యంత కీలకంగా మారింది. పేరుకే మూడు రాజధానులు పాలన అంతా విశాఖపట్నం నుంచే ఉంటుంది అని తేల్చేశారు. ఒక వైపు సీఎం జగన్ తనకు మూడు ప్రాంతాలు ముఖ్యం అని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న వేళ ధర్మాన అవి రెండు ఉత్తుత్తి రాజధానులు..అసలు సిసలు రాజధాని మాత్రం వైజాగ్ మాత్రమే అని ప్రకటించారు. పేరుకు మూడు..పాలన అంతా ఇక్కడినుంచే అంటూ చెప్పారు. జగన్ మాత్రం మూడింటికి సమాన ప్రాధాన్యత ఉండేలా ఈ నిర్ణయం అంటూ చెపుతూ వస్తున్నారు. ధర్మాన ఇప్పుడు ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.వాస్తవానికి ఏ రాష్టానికి అయినా పరిపాలనకు గుండెకాయ సచివాలయమే. ఇక్కడ సెలవు రోజులు తప్ప ప్రతిరోజూ పని నడుస్తూ ఉంటుంది. అదే అసెంబ్లీ విషయాన్ని వస్తే ఏడాదికి ఇప్పుడు ఒక 40 రోజులు నడిస్తే గొప్ప. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు...పని దినాలు చాల ఎక్కువ ఉండేవి.

ఇప్పడు అన్ని మారిపోతున్నాయ్. ఇక హై కోర్ట్ విషయానికి వస్తే ఇది అవసరం అయ్యేది ప్రభుత్వానికే ఎక్కువ తప్ప..ప్రజలకు కాదనే విషయం తెలిసిందే. ధర్మాన మాటలతో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత వట్టి మాటే...తోలి ప్రాధాన్యత విశాఖ మాత్రమే అని తేలిపోయింది . ఒక వైపు అసెంబ్లీ బిల్ పాస్ చేసి తర్వాత వెనక్కి తగ్గి..ఒక మంత్రి అయి ఉండి ఇప్పుడు మూడు రాజధానులు కాదు అని చెప్పటం అంటే వైసీపీ తాము ఏమి చేప్పినా ఎవరూ ఏమి చేయలేరు అన్న చందంగా వ్యవరించటమే అని ఒక ఒక వైసీపీ నేత అభిప్రాయపడ్డారు. ధర్మాన ప్రకటన రాజకీయంగా అమరావతి ప్రాంతంతో పాటు కర్నూల్ వంటి చోట కూడా పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. అమరావతి లో ప్రస్తుతం ఉన్న రాజధానిని కాదని వైజాగుకు తరలిస్తున్నారు. అంటే మరి రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేళ ఎకరాలను ఏమిచేస్తారు..ఒక వేళ జగన్ చెపుతున్నట్లు కొత్త అసెంబ్లీ కట్టిన దీనికి ఒక వంద ఎకరాలు సరిపోతాయి ఎంత పెద్ద కట్టడం కట్టినా. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి..రైతుల ఒప్పందాలు ఏమిటి అన్నధీ మాత్రం ఎప్పటికి తేలుతుందో.

Next Story
Share it