Telugu Gateway
Andhra Pradesh

దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు

దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు
X

వైరల్ గా మారిన ఆడియో క్లిప్

తెలుగు దేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని జనసేన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వంద కోట్ల రూపాయలు అవినీతి చేసినట్లు యూట్యూబ్ లో ఒక వీడియో చూసిన ఆయన ఇదే విషయంపై మాట్లాడటానికి జనసేన కు చెందిన నాయకుడు కరాటం రాంబాబు కు ఫోన్ చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇందులో ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అని మాట్లాడుకోవటంతో పాటు పోలవరం ఎమ్మెల్యే అవినీతి విషయాలు ఏవీ పవన్ కళ్యాణ్ కు తెలియదా అని మాట్లాడారు. అదే సమయంలో ఉమా మహేశ్వర రావు టీడీపీ ఎంపీ సానా సతీష్ , బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమా మహేశ్వర రావు...జనసేన నేత కరాటం రాంబాబులు మధ్య సాగిన సంభాషణ ఇలా ఉంది. యూ ట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనిపిస్తే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది ఒక కేసు స్టడీ. దేశ చరిత్రలోనే గొప్ప విషయం అంటూ ఉమా మహేశ్వర రావు మాట్లాడితే...ఇది సర్క్యూలేట్ అవుతుంది కానీ..మీరు అబ్సర్వ్ చేసినట్లు లేదు..ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు వ్యవస్థ లేదు అంటూ రాంబాబు మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేను పెట్టింది మీరే అని..మిమ్మల్ని అడిగాను అని ఉమా అంటే....వ్యవస్థ మొత్తం బాగోలేదు అండి జిల్లాలో అని రాంబాబు చెప్పుకొచ్చారు.

దీనిపై ఉమా మహేశ్వర రావు స్పందిస్తూ ఎందుకు వన్ ఇయర్ లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఇంకా నాలుగేళ్లు ఉందిగా. అంటే..రాంబాబు స్పందిస్తూ నాలుగేళ్లు ఉన్నా చెడ్డపేరు తెచ్చుకోవటం ఏంటి అండి...పార్టీ కి ఎంత డ్యామేజ్. ఇతనే కాదు అండి అని రాంబాబు అంటే...ఉమా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదులెండి అన్నారు. మీకు తెలుసు కదా చాలా డ్యామేజ్ అంటూ చెప్పుకొచ్చారు రాంబాబు. పోలవరం ఎమ్మెల్యే ఇంకో రకంగా తయారు అయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తుంటాను. కొంత అల్లరి ఎక్కువ జరుగుతుంది. రాజమండ్రిలో కేసు ఉంటే వచ్చాను అని...తన మీద 82 కేసులు ఉన్నాయని ఉమా చెప్పగా..మీకు ఇంకా మీకు ఏ పదవి రాలేదు అంటే...ఉమా దీనిపై స్పందిస్తూ టైం వచ్చినప్పుడు అదే వస్తది అన్నారు. యూ ట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి ..మీరు తీసుకొచ్చి అందరిని కలుపుకుని గెలిపించి చేశారు కదా..మీరు ఎంత బాధ పడుతున్నారో అని కాల్ చేశా అన్నారు ఉమా. అవునండి. కొంత ఇబ్బందిగానే ఉంది అని రామారావు తెలిపారు. కాకపోతే కంట్రోల్ చేస్తున్నట్లు చెప్పారు. టైం ఉంది..మళ్ళీ మాములు స్థితికి తీసుకు రావాలి. కూటమి దెబ్బతింటది. ఇలాంటి వాటి వాళ్ళ అని రాంబాబు వ్యాఖ్యానించగా...పవన్ కళ్యాణ్ కు తెలుస్తాయా ఇవి అన్ని అని ఉమా అడిగితే...ఏమో తనకు కూడా అర్ధం కావటం లేదు అన్నారు. ఏమి జరుగుతుంది అని ఎవరూ అడగటం లేదా అని ఉమా ప్రశ్నిస్తే ఇప్పటి వరకు తనకు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు అని చెప్పారు. ఇప్పుడు తాను చేసినట్లు పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా చేయలేదా అంటే ఇప్పటి వరకు లేదు అన్నారు.

తాను చంద్రబాబు ను ఒక్క సారి చంద్రబాబు ను కలిసి నిర్వాసితుల గురించి మాట్లాడినట్లు రాంబాబు చెప్పగా..మీ లాంటి వాళ్లపై చంద్రబాబుకు గౌరవం ఉంటుంది...గుర్తుపట్టి గౌరవిస్తారు అన్నారు ఉమా. ఆ సమయంలో రాంబాబు స్పందిస్తూ చంద్రబాబు తనను పార్టీలోకి రమ్మని పిలిచారు అని ...అప్పటిలో కావూరి సాంబశివరావు తన సభ్యత్వం కూడా తీసేశారు అని చెప్పారు. చంద్రబాబు తర్వాత కంభంపాటి రామమోహన్ రావు కూడా మాట్లాడారు. అప్పుడు సీఎం రమేష్ , సానా సతీష్ కూడా తన పక్కన ఉన్నారు ఈ ఫోన్ వచ్చినప్పుడు అని రాంబాబు చెప్పారు. ఆ సమయంలోనే దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉమా స్పందిస్తూ సానా మంచి పొజిషన్ కు వెళ్ళాడు...సీఎం రమేష్ అమిత్ షా పక్కన ఉన్నాడు...సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు. రాంబాబు పోలవరం దగ్గరే ఉన్నారు అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి తో పాటు ఇద్దరి ఎంపీల గురించి దేవినేని ఉమామహేశ్వర రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ దెబ్బకు ఉమాకు వస్తది అనుకున్న ఎమ్మెల్సీ కూడా అనుమానమే అన్న చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది.

Next Story
Share it