రాత్రికి రాత్రే బీమా కట్టారు
వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ మండిపడింది. రైతుల పంటల బీమా కట్టకుండానే కట్టినట్లు సభను తప్పుతోవ పట్టించారని..దీనిపై తాము సభలో ఆందోళన చేసినందునే రాత్రికి రాత్రి బీమా జీవో జారీ చేశారని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబుని ఏకవచనంతో మాట్లాడే మంత్రులు మనుషులేనా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్యూరెన్స్ కట్టామని ప్రభుత్వం సభలో సీఎం, వ్యవసాయ మంత్రి అవాస్తవాలు చెప్పారన్నారు.
అర్ధరాత్రి ఆదరా బాదరాగా 590 కోట్లు ప్రీమియం చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న అర్ధరాత్రి జీవో ఇచ్చిన వాళ్లు పంటల బీమా ప్రీమియం చెల్లించామని ఎలా అబద్ధాలు చెప్పారని ప్రశ్నించారు. ఏవిధంగా రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేసిందో గ్రహించాలని అచ్చెన్నాయుడు కోరారు. పంటల బీమా విషయంలో అధికారపక్షం అడ్డంగా దొరికిపోయిందని టీడీపీ పేర్కొంది.