జగన్ స్పీచ్ ఉందంటే టీడీపీకి పండగే!

జగన్ మీడియా నుంచి ప్రశ్నలు తీసుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడరని..అందుకే ఆయన విలేకరుల సమావేశాలు పెట్టరని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్నిసార్లు అయితే జగన్ మాట్లాడతారని చెప్పి...రికార్డెడ్ వీడియోలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన పదాలు కొన్ని ప్రజలను షాక్ కు గురిచేశాయనే చెప్పొచ్చు. ఈ విచిత్ర పదాల వీడియోను తెలుగుదేశం పార్టీ వైరల్ చేస్తోంది. దీనికి ముందు ఓ సమాశంలో మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను కూడా జోడించారు. 'చూడటానికి ఉత్త అమాయకంగా ఉంటాడు కానీ..ఒక్కసారి బయటకు వస్తే'.అని రోజా చెప్పగానే..మగధీర సినిమాలో శ్రీహరి డైలాగ్ షురూ అని వ్యాఖ్యానించటంతోనే జగన్ విచిత్ర ఉపన్యాస పదగుళికలు బయటకు వస్తాయి. ' ఈ దేశం పైరు పచ్చలతో..సమరయోధుల త్యాగనిరిధికి..మహానుయోధులు..త్యాగాలు స్వేద్వంతో..సామాజిక అభ్ర..జవహర్ లాల్ నెహ్రు ఉటకించారు. కార్పొషెన్, అక్కచెల్లెమ్మలకు హార్ధికంగా..విప్లవాత్మిక చర్యలు, కార్పొరేట్ విద్యా సన్ స్థలు కోసం..చదవ..చదవక, గోదం..' వంటి విచిత్ర పదాల ఎన్నో తెరపైకి తెచ్చారు సీఎం జగన్.