Telugu Gateway
Andhra Pradesh

రామానాయుడిపై జగన్ ఫైర్

రామానాయుడిపై జగన్ ఫైర్
X

తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడిపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో చర్చ సందర్భంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన రామానాయుడు కాదు. డ్రామానాయుడని ఎద్దేవా చేశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం కోరుతుమన్నారు. ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ సభ్యుడు రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్‌ తెలిపారు. అసెంబ్లీ అంటే రాజకీయాలు చేయటానికేనా అంటూ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. పెన్షన్ల పంపిణీపై టీడీపీ సభ్యులు చేసిన విమర్శలను తోసిపుచ్చారు. ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై చర్చను తాను సిద్ధమన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత పెన్షన్‌ ఎంత అన్నది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రూ.2250 పెన్షన్‌ అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్‌ ఇస్తూ, ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం పెన్షన్‌ రూ.2 వేలు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు, (అక్టోబరు 2018) వరకు రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్లు 44 లక్షలు మాత్రమేననీ, తమ ప్రభుత్వంలో 61.94 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ బిల్లు రూ.500 కోట్లు కూడా లేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వంలో నెలకు 1500 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇస్తున్నామన్నారు. సభ సజావుగా జరగకుండా అడ్డుకుని సస్పెన్షన్‌ కోరుకున్నారని.. చంద్రబాబుకు పేదల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.79,806 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు.

Next Story
Share it