Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో రేప్ లు చేసిన వాళ్లంతా టీడీపీనే

ఏపీలో రేప్ లు చేసిన వాళ్లంతా టీడీపీనే
X

పేప‌ర్ లీక్ లు చేసింది నారాయ‌ణ‌..చైత‌న్య స్కూళ్ళే

ఇది ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తిరుప‌తి వేదిక‌గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు గుంటూరులో ఏదో జ‌రిగింద‌ని..వైజాగ్ లో ఏదో అయిపోయింద‌ని..విజ‌య‌వాడ‌లో అత్యాచారం జ‌రిగింద‌ని..అస‌లు రాష్ట్రం అంతా ఏదో అయిపోయింద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇది ఎవ‌రో చేశారో ఈనాడు రాయ‌దు..ఆంధ్ర‌జ్యోతి చెప్ప‌దు..టీవీ5 చూపించ‌దు. వీళ్లంతా ఎవ‌రో తెలుసా?. తెలుగుదేశం వాళ్లే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్. ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షల విష‌యంలో కూడా ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని..లీక్ లు అని..మ‌రొక‌టి అని ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇది చేసిందో ఎవ‌రో తెలుసా?. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన నారాయ‌ణ స్కూళ్లు..చైత‌న్య స్కూళ్ళే అని తెలిపారు. దుష్ట‌చ‌తుష్టం..దొంగ‌ల ముఠా అయిన చంద్ర‌బాబు, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5లు చేసే ప‌నులు అన్నీ గ‌మ‌నిస్తూ ఉండాల‌ని..విద్యా దీవెన‌తో పాటు అక్క, చెల్లెమ్మ‌ల‌కు ఎన్నో మంచి ప‌నులు చేస్తున్న త‌న‌కు మంచి పేరు రావొద్ద‌నే ఇలా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అందుకే తిరుప‌తి వేదిక‌గా దేవుడా ఈ రాష్ట్రాన్ని ర‌క్షించు ఎల్లో మీడియా నుంచి..ఎల్లో పార్టీ నుంచి, దుష్ట చ‌తుష్టం నుంచి అని తిరుప‌తిలో వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ప్రార్ధిస్తున్నా అన్నారు. డైర‌క్షన్ వాళ్ళ‌ద‌..యాక్షన్ వాళ్ళ‌దే...గోల చేసేది కూడా వీళ్లే అంటూ వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు ఇవి అన్నీ గ‌మ‌నించాలని సూచించారు. చ‌దువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను.. ఒక దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

తిరుపతి పర్యటన సందర్భంగా.. తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని అన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చింది. పాదయాత్రలో ఎన్నో కష్టాలను కళ్లారా చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదనుకున్నా. అందుకే.. విద్యార్థులకు లబ్ధి చేకూరే పథకాలతో గొప్ప విప్లవం తీసుకొచ్చాం అన్నారు సీఎం జగన్‌. విద్యాదీవెన అనేది రాష్ట్రంలోనే గొప్ప పథకం అని, అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. అరకోర ఫీజులతో, రీయంబర్స్‌మెంట్‌లతో గత ప్రభుత్వం వ్యవహరిస్తే.. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించి మరీ విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఏంటో మీరే గమనించడని తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం జగన్‌ కోరారు.

Next Story
Share it