Telugu Gateway
Andhra Pradesh

ఏ సీజ‌న్లో న‌ష్ట‌పోతే ఆ సీజ‌న్ లోనే రైతుల‌కు న‌ష్ట‌పరిహారం

ఏ సీజ‌న్లో న‌ష్ట‌పోతే ఆ సీజ‌న్ లోనే రైతుల‌కు న‌ష్ట‌పరిహారం
X

వైసీపీ ప్ర‌భుత్వం రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటుంద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నామ‌న్నారు. రాయలసీమలో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగింద‌ని, ఏపీలో అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయ‌ని తెలిపారు. . వైసీపీ అధికారంలోకి వచ్చాక వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలోనూ వర్షాలు ప‌డ్డాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయార‌ని, అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నామ‌ని తెలిపారు. నేలకోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిస్తున్న‌ట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం మంగళవారం ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేశారు.

దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరిన‌ట్లు అయింది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు. మొత్తం 571.57 కోట్ల రూపాయ‌ల‌ను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ1,612.62 కోట్ల రూపాయ‌లుగా ఉంది.

Next Story
Share it