Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ నోట రిక్వెస్టా!..ఇది సంచ‌ల‌న‌మే!

జ‌గ‌న్ నోట రిక్వెస్టా!..ఇది సంచ‌ల‌న‌మే!
X

అది ఎంత పెద్ద నిర్ణ‌యం అయినా సీఎం జ‌గ‌న్ ఆదేశించ‌టమే. ఆయ‌న మాట‌కు ఎదురుచెప్పే సాహ‌సం సీఎస్ లు కూడా చేయ‌రు..చేయ‌లేర‌ని అధికార వ‌ర్గాలు చెబుతుంటాయి. న్యాయ‌స్థానం విష‌యంలో కూడా చాలాసార్లు త‌మ‌కు ప్ర‌జ‌లు 151 సీట్ల‌తో అధికారం అప్ప‌గిస్తే..ఈ అడ్డంకులు ఏంటి అని ప్ర‌శ్నించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఎన్ని సీట్లు వ‌చ్చినా కూడా ప్ర‌భుత్వంలో..ప‌రిపాల‌న‌లో కొన్ని నియ‌మ‌, నిబంధ‌న‌లు ఉంటాయ‌నే విష‌యం పాల‌కులు గుర్తించుకోవాలని చాలా మంది అధికారులు చెప్పారు. అయినా కొన్ని ప‌ట్టించుకున్నారు..కొన్ని ప‌ట్టించుకోలేదు. ఇది అంతా ప‌క్క‌న పెడితే సీఎం జ‌గ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం నిర్వ‌హించిన స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే అధికారుల‌ను ఉద్దేశించి ద‌య‌చేసి..ద‌య‌చేసి అంటూ వ్యాఖ్యానించ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎంత‌సేపూ బ్యాక్ ఫుట్ బ్యాటింగ్ కాదు..అవ‌స‌రం అయితే ఫ్రంట్ ఫుట్ లోనూ బ్యాటింగ్ చేయాల‌నే విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకోండి. క‌లెక్ట‌ర్లు, సీఎండీలు, ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో ఉంచుకోవాల‌న్నారు.

ఈ స‌మావేశంలో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ఇలా ఉన్నాయి...' మ‌నం ఇక్క‌డ యుద్ధం చేస్తున్న‌ది చంద్ర‌బాబుతోనే..తెలుగుదేశం పార్టీతోనే కాదు. ప‌ని క‌ట్టుకుని అదే మాదిరిగా ఎంత మంచి చేసినా కాదు..అది చెడే అని ప్ర‌చారం చేస్తున్న నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నాం. మీడియా సంస్థ‌లు కూడా ఈ మాదిరిగా చొక్కాలు విప్పేసి ఏకంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని ఇంత‌గా క‌ష్ట‌ప‌డే ప‌రిస్థితి నేనెప్పుడూ చూడ‌లా. అయినా కూడా ఇలాంటి దుర్మార్గ‌మైన మీడియా వ్య‌వ‌స్థ‌ను చూస్తున్నాం కాబ‌ట్టి..మ‌నం చేసింది త‌ప్పులేదు..వాళ్లు చేసింది త‌ప్పు ..మ‌న మీద ఆబ‌ద్ధాలు చెబుతున్నార‌ని అన్పించిన‌ప్పుడు ద‌య ఉంచి ఖండించండి. ద‌య ఉంచి ఖండించ‌క‌పోతే ..ఫ్యాక్ట్స్ చెప్ప‌క‌పోతే..ఇది నిజ‌మోనేమో అనే వాతావ‌ర‌ణానికి తావివ్వ‌కూడ‌దు. క‌ల‌క్ట‌ర్ల ద‌గ్గ‌ర నుంచి సీఎండీల దాకా..సేమ్ టైమ్ ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ కూడా..ఇది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. మీరు కూడా ఫ్రంట్ ఫుట్ లో బ్యాటింగ్ చేయాల‌నేది మ‌న‌సులో పెట్టుకోండి. ఎంత‌సేపూ బ్యాక్ ఫుట్ లోనే కాదు.జ్ణాప‌కంలో పెట్టుకుని ఇంప్లిమెంట్ చేయ‌మ‌ని అంద‌రినీ కూడా అడుగుతున్నా.' అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it