Telugu Gateway
Andhra Pradesh

సీఎం జగన్ తో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు భేటీ

సీఎం జగన్ తో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు భేటీ
X

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నం శారదాపీఠంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్ చేరుకున్నారు. ఆయనతో విమానాశ్రయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు సమావేశం అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని...విశాఖ స్టీల్ కు ఇనుప ఖనిజం సమస్య లేకుండా చేయాలంటే ఎన్ఎండీసీలో ఈ సంస్థను విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని నేతలు కోరినట్లు సమాచారం.

దీంతోపాటు అసెంబ్లీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరగా..ఇందుకు జగన్ అంగీకరించినట్లు సమాచారం. కేంద్రంలోని మోడీ సర్కారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. మరి కేంద్రం ఈ విషయంలో ఏపీ ప్రజల, స్టీల్ ప్లాంట్ ఉద్యోగాల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక తాను అనుకున్నట్లు ముందుకెళుతుందా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it