Telugu Gateway
Andhra Pradesh

పింగళి వెంకయ్యకు భారతరత్న

పింగళి వెంకయ్యకు భారతరత్న
X

భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి ఆయన లేఖ రాశారు. సీఎం జగన్ శుక్రవారం నాడు గుంటూరు జిల్లా మాచర్లలో ఉంటున్న పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

సీఎం వైఎస్‌ జగన్‌.. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం పరిశీలించారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా పింగళి వెంకయ్య అందించారని, తండ్రిగా పింగళి వెంకయ్య తనను గాంధీకి పరిచయం చేశారని ఆమె ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Next Story
Share it