సీఎం జగన్ కాలినొప్పి ఒక్క రోజులోనే తగ్గిందా?!
గాయబ్. ఇట్స్ గాన్ అన్నట్లు ఉంది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి కాలినొప్పి వ్యవహారం. ఒక్క రోజులోనే సీఎం జగన్ కాలినొప్పి మాయం అయిందా?...ఒంటిమిట్ట వెళ్ళటానికి అడ్డం వచ్చిన కాలినొప్పి....చిలకలూరి పేట వెళ్ళటానికి లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ గురువారం నాడు అక్కడ ఫ్యామిలి డాక్టర్ ప్రోగ్రాము తలపెట్టారు. దీంతో మరో సారి జగన్ కాలి నొప్పి విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ ఐదున ఒంటిమిట్టలో శ్రీకోదండరామాలయం బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. కానీ సీఎంఓ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. అది ఇలా ఉంది.
‘ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు కాలినొప్పి. ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.’ అంటూ అధికారికంగా ప్రకటించారు. కానీ మరి ఈ కాలినొప్పి ఒక్కరోజులో అంటే.. ఫ్యామిలి డాక్టర్ ప్రోగ్రాము కు మాయం అయిపోయిందా అనే చర్చ సాగుతోంది. దీంతో నిజంగానే జగన్ కాలినొప్పి కారణంగానే ఒంటిమిట్ట కార్యక్రమానికి దూరంగా ఉన్నారా...లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఒక్క రోజులోనే రెస్ట్ తీసుకోవాలని చెప్పిన డాక్టర్లు మరి ఇప్పుడు ఒక అన్నారా అనే ప్రసంగాలు వస్తున్నాయి.