జగన్ తన బూతులు మర్చిపోయారు !
అప్పుడు అదే డైలాగు ..ఇప్పుడు అదే డైలాగు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగానే వచ్చి 50 శాతం ఓట్లు..151 సీట్లు దక్కించుకున్నారు. ఒక్కడిపై అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు అంటే అప్పుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు జగన్ ఒంటరి కాదు. అధికారం అనే ఆయుధం తో ఉన్నారనే విషయాన్నిమర్చిపోయారా లేక ఇంకా పాత సెంటిమెంట్ ను వాడుకోవాలని చూస్తున్నారా అంటే సెంటిమెంట్ డైలాగు లే కనిపిస్తున్నాయి. తాను మూడు రాజధానులతో మేలు చేయాలనీ చూస్తుంటే .కొంతమంది మూడు..నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని చెపుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై ఎటాక్ చేశారు. వీళ్లా మన నాయకులూ అని ఎద్దేవా చేశారు. కొంతమంది బూతులు మాట్లాడుతూ .చెప్పులు చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలా చేసి ఉండాల్సింది కాదు. కానీ జగన్ తన మంత్రివర్గంలో ఉన్న కొంత మంది మంత్రులు ప్రతిపక్ష నాయకులను అడ్డగోలుగా బూతులు మాట్లాడితే ..దుర్భాషలు చేసినప్పుడు జగన్ కనీసం వారిని మందలించి ఉంటే ఇప్పుడు జగన్ చెడుపుతున్న మాటలకూ విలువ వచ్చి ఉండేది.
కానీ జగన్ ఆ పని ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఎవరు తప్పు మాట్లాడిన ఖచ్చితంగా ఖండించాలిసిందే. ఈ విషయం లో అధికారం లో ఉన్నవాళ్లకు ఎక్కువ బాధ్యత ఉంటుందన్న విషయం తెలిసిందే.