జగన్ కు కేసు ల తిప్పలు !

సిబిఐ ఇప్పుడు ఈ కేసు లో ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి తో పాటు అయన తండ్రి భాస్కర్ రెడ్డి పై పలు ఆరోపణలు చేస్తోంది. సిబిఐ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు అన్ని జగన్ కు నైతికంగా , రాజకీయంగా ఇబ్బండి కలిగించే అంశాలే అనే చర్చ సాగుతోంది. మరో కీలక కేసు కోడి కత్తి కేసు. ఇందులోనూ కీలక ట్విస్ట్ లు వస్తున్నాయి. ఈ కేసు ను విచారించిన కేంద్ర విచారణ సంస్థ ఎన్ఐఏ ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు అని, జగన్ చెపుతున్నట్లు ఇంకా లోతైన విచారణ అవసరం లేదు అని..ఇప్పటికే తాము అన్ని కోణాల్లో విచారణ చేసినట్లు పేర్కొంది. సీఎం జగన్ పై దాడి చేసిన శ్రీను వెనక ఎవరో ఉన్నారు అనటానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జగన్ సీఎం అయిన ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ కూడా తనపై జరిగిన దాడి గురించి ప్రత్యేక దృష్టి పెట్టిన దాఖలాలు లేవని..ఇది కూడా అనుమానాలు పెరగటానికి ఒక కారణంగా ఉంది అని ఒక వైసీపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎన్ఐ ఏ ఛార్జ్ షీట్ వేసి ..కేసు ఫైనల్ అయ్యే సమయంలో మరింత లోతైన దర్యాప్తు అంటూ జగన్ పిటిషన్ వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు సానుభూతి వచ్చేందుకే తాను ఈ దాడి చేసినట్లు శ్రీనివాస్ ఎన్ఐ ఏ కు స్టేట్ మెంట్ ఇవ్వటం కూడా ఇందులో కీలకంగా ఉంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో మరో సారి ఈ రెండు కేసు ల చుట్టూ తిరిగే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది.