Telugu Gateway

రాజకీయంగా దొంగదొబ్బ తీసేందుకే ఈ దాడులు

రాజకీయంగా దొంగదొబ్బ తీసేందుకే ఈ దాడులు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమను దొంగ దొంగ దెబ్బ తీసేందుకే దేవాలయాల్లో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయని..రాజకీయంగా తమను ఎదుర్కొలేకే ఇలాంటి పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. వీరికి దేవుడు అంటే భయం, భక్తి లేకుండా పోయిందన్నారు. ఎవడు చేశాడు..ఎక్కడ చేశాడో లోతైన ఎంక్వైరీ చేయండి..డిస్ ప్లే కూడా చేయండి. ఎవరైనా మళ్లీ చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి అని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే ఎన్నడూలేని రీతిలో 36 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. గుళ్ళలో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి గుడులు, గోపురాలను రయించుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అయినా ఎన్ని సీసీ కెమెరాలు అని పెట్టగలుగుతాం అని ప్రశ్నించారు. అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి విషయాల్లో ఎవరినీ ఉపేక్షించవద్దని తెలిపారు.

రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మతాలు..మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి. మతాల మధ్య ద్వేషాలు పెంచేందుకు ప్రయత్నం చేసేవారిపై స్ట్రిక్ట్ గా ఉండాలి. మతాల మధ్య చిచ్చు పెట్టి కొంత మంది రాజకీయంగా లబ్దిపొందటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎవరూ లేని సమయం చూసుకుని..అర్ధరాత్రి గుళ్లలోకి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నారని.. వాళ్లే మళ్ళీ సోషల్ మీడియాలో ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారని విమర్శించారు. ఇందుకు కొన్ని మీడియా సంస్థలు కూడా సహకరిస్తున్నాయని..వాటిని ఆసరా చేసుకుని ప్రభుత్వంపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.

Next Story
Share it