Telugu Gateway
Andhra Pradesh

పవన్ సభలో 'దివీస్'పై జగన్ క్యాసెట్

పవన్ సభలో దివీస్పై జగన్ క్యాసెట్
X

ప్రతిపక్షంలో ఉండగా దివీస్ పరిశ్రమపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడారు. ఇప్పుడు ఏమి చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా దివీస్ పరిశ్రమను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్..అధికారంలోకి వచ్చాక మాత్రం పూర్తిగా ఆ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనికి ఆధారంగా గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోలను కొత్తపాకల బహిరంగ సభలో ప్రదర్శించారు. ఇప్పుడు దివిస్ ప్రాజెక్టును ఆపేది లేదు... ఎవరు అడ్డొస్తారో చూస్తాం అని జగన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లేదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అన్నారు. 'అప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నారు... ఇప్పుడు అనుమతినిచ్చారు. ఇదేం రాజకీయం – ఇవేం విలువలు. అక్రమంగా అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలి. దివిస్ వల్ల కాలుష్యం ఉండదని శాస్త్రీయంగా నిరూపించండి. పిల్లికి ఎలుక సాక్ష్యం లాంటి రాంకీ నివేదిక చూపిస్తున్నారు' అని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివీస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్ధతుగా శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 50 లక్షల మంది వరకు జనాభా ఉంది. ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలు రావాలని కోరుకుంటాం. పర్యావరణానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే అది ఏ స్థాయిలో అన్నదే మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. ఆస్తులు ఇవ్వొచ్చు ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇవ్వలేం. మన బిడ్డలకు వారసత్వంగా ఆస్తులు, పొలాలు, బంగారం ఇవ్వగలం. కానీ ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇవ్వలేం. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమై అనారోగ్యానికి గురైతే... మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్లు అనుభవించలేరు. ఈ భూమి ఎవరి సొంతం కాదు. సగటు మనిషి జీవిత కాలం 64 ఏళ్లు. ఈ 64 ఏళ్లు ఈ భూమి మీద సక్రమంగా జీవించి, భావితరాలకు పదిలంగా అప్పగించాలి. వేల కోట్లు, వందల ఎకరాలు, ఖరీదైన ప్రాంతంలో ఇళ్లు కట్టి పిల్లలకు ఇస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని వైసీపీ నాయకులు అనుకుంటే పొరపాటే.

విశాఖపట్నంలో స్టరీన్ గ్యాస్ లీక్ అయినపుడు డబ్బున్నవాడి మీద, పేదవాడి మీద ఒకేలా పనిచేసిందని గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ ప్రజాప్రతినిధులు నాకు శత్రువులు కాదు. విధానాలు సరిగా లేనప్పుడు కచ్చితంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తాం. పరిశ్రమ కోసం భూములు కావాలంటే ముందు సామాజిక ప్రభావం అంచనా వేయాలి. తమ పొలాల్లోకి వెళ్లినందుకు 160 మందిపై కేసులు పెట్టారు. 36 మంది ఇప్పటికీ జైల్లో మగ్గిపోతున్నారు. ఈ గ్రామీణులు సూట్ కేసు కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడలేదు. హ్యతలు, దోపిడీలు చేయలేదు. కోడి కత్తితో పొడవలేదు. కోడి కత్తితో పొడిచినోళ్లు, పొడిపించుకున్నోళ్లు బాగానే ఉన్నారు. కానీ భూమి కోసం పోరాటం చేసినోళ్లు మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు.' అని విమర్శించారు.

Next Story
Share it