Telugu Gateway
Andhra Pradesh

ఎర్ర‌జెండాలు..ప‌చ్చజెండాల కుట్ర‌లు

ఎర్ర‌జెండాలు..ప‌చ్చజెండాల కుట్ర‌లు
X

వాళ్లు అస‌లు మ‌నుషులేనా?. జ‌గ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీతోపాటు క‌మ్యూనిస్టులు..ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మండిప‌డ్డారు. ఉద్యోగుల స‌మ్మె ఆగిపోయినందుకు ఎర్ర‌జెండాలు..పచ్చ‌జెండాలు త‌ట్టుకోలేక‌పోతున్నాయ‌ని ఆరోపించారు. వీళ్లు ఇంకా కుట్ర‌లు చేస్తూనే ఉన్నార‌ని..వీళ్లు అస‌లు మ‌నుషులేనా అంటూ మండిప‌డ్డారు. క‌రోనా కార‌ణంగా రెండు సంవ‌త్స‌రాలుగా ప‌రీక్షలు లేకుండానే పాస్ చేస్తున్నామ‌ని..ఈ త‌రుణంలో కూడా క‌మ్యూనిస్టులుకు చెందిన యూనియ‌న్లు మ‌ళ్ళీ అల‌జ‌డి రేపాల‌ని చూస్తున్నాయ‌ని ఆరోపించారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లోమీడియాకు పండగ అని సీఎం జగన్‌ అన్నారు. సంధి జరిగింది.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంలేదని వారికి మంటగా ఉంద‌న్నార‌రు. సమ్మె విరమించారనగానే కమ్యూనిస్టులను ముందుకు తోశారని మండిపడ్డారు. చంద్రబాబు ఎల్లోమీడియాకు మాత్రమే సమ్మె కావాలని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌రోసారి చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడిగా అభివ‌ర్ణించారు.

ఎస్పీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి.. రామోజీరావుకు ముద్దుబిడ్డగా ఉన్నారని మండిపడ్డారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న వ్యక్తి ఏబీఎన్‌ రాధాకృష్ణ చంద్రబాబు ఆత్మీయుడని దుయ్యబట్టారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్ ఆరోపించారు. పేదల ఇళ్లను అడ్డుకున్న వ్యక్తి కామ్రేడ్లకు ఆత్మీయుడు అని విమర్శించారు. 'జగనన్న చేదోడు' కార్య‌క్ర‌మం ప్రారంభించిన సంద‌ర్బంగా మాట్లాడిన జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేస్తున్నామని తెలిపారు. 2,85,350 మంది బ్యాంక్‌ ఖాతాల్లో 285.35 కోట్ల రూపాయ‌ల‌ను జమ చేస్తున్నామని పేర్కొన్నారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద సాయం అందజేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. నామినేటెడ్‌ పదువుల్లో వెనకబడ్డ వర్గాలకు పెద్దపీట వేశామని అన్నారు.

Next Story
Share it