Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కు కెసిఆర్ అంటే భయమా...లేక లాలూచీనా?!

చంద్రబాబు కు కెసిఆర్ అంటే భయమా...లేక లాలూచీనా?!
X

ఇదేమి రాజకీయం ‘బాబోయ్’ అంటున్నారు తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు. బుధవారం నాడు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వయించిన తెలుగు దేశం పార్టీ 41 వ ఆవిర్భావ సభలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరు చూసి అందరూ షాక్ కు గురి అవుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలి అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలి...వైఫల్యాలను ఎండకట్టాలి. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి మాట్లాడాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు మాత్రం ఒక్కటంటే ఒక్క మాట కెసిఆర్ గురించి మాట్లాడలేదు. ఇది చూసిన వారు అంతా తెలంగాణ సీఎం కెసిఆర్ అంటే చంద్రబాబు కు భయమా లేక లాలూచి పడ్డారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యర్థి సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ...తెలంగాణ కు వచ్చి మాత్రం మౌనం దాల్చటం తో ప్రతిఒక్కరు ఈ విషయాన్నీ గ్రహిస్తారు అన్న సంగతి చంద్రబాబు కు తెలియదా అంటే...కచ్చితంగా ఆ ఛాన్స్ ఉండదు అనే చెప్పాలి. మరి దీని వెనక ఉన్న కారణం ఏమిటి అన్నదే ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఇలా అయితే చంద్రబాబు ను నమ్మి లీడర్లు, క్యాడర్ ఎలా ముందుకు వస్తారు అని ఒక సీనియర్ నేత ప్రశ్నించారు.

ఈ సభలో చంద్రబాబు మాటలు కొన్ని. ‘గుడ్ పాలిటిక్స్ ...గుడ్ గవర్నెన్స్ కావాలి. చాలా మందికి రాజకీయాలు అంటే అనాసక్తి ఉంది. టైం దొరికిదే సినిమాలు..లేదా బయటకు పోవటం . కానీ మీ జాతకాలను మార్చేది. ...విధానాలను తెచ్చేది రాజకీయాలు మాత్రమే. పెద్ద నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీ పెరుగుతుంది అని ప్రధాని మోడీ కి చెప్పా. ఏ పార్టీ సుపరిపాలన అందిస్తోందో...ఎవరు అభివృద్ధి చేస్తారో ఆలోచించండి. ఐదు వేలు ఇచ్చి శాశ్వత మెంబర్ అయి పార్టీ కు నిధులు ఇవ్వటం పెద్ద కష్టం కాదు. నా తర్వాత వచ్చిన వైస్సార్, కెసిఆర్ లు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు. కలిసి నడుద్దాం ..కలిసి అభివృద్ధి సాధిద్దాం ’ అంటూ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మహానాడు సభ ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్‌ గౌరవ సూచకంగా కేంద్రం రూ.100 వెండి నాణెం విడుదల చేసిందని, దీనికి ప్రధాని మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్‌, పోర్టులు, రోడ్లు సహా పలు రంగాల్లో సంస్కరణలు తెచ్చామన్నారు. మహిళలకు చేయూత కోసం డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలు అద్భుతంగా పనిచేస్తున్నారని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ సభలో చంద్రబాబు గత చరిత్ర చెప్పటానికి మాత్రమే పరిమితం అయ్యారు తప్ప...ప్రస్తుత రాజకీయాలపై మాట్లాలేదు అనే చెప్పాలి.

Next Story
Share it