Telugu Gateway
Andhra Pradesh

హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన చంద్రబాబు

హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన చంద్రబాబు
X

అమరావతిలో అసైన్ మెంట్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలు హైకోర్టు ను ఆశ్రయించారు. తమపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని వారు క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై శుక్రవారం నాడు విచారణ జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ ఈ కేసులో ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించి అటు చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణకు సీఆర్ పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని లేకపోతే అరెస్ట్ కూడా చేయాల్సి ఉంటుందని సీఐడీ తన నోటీసులో పేర్కొంది. పలు సెక్షన్ల కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై పలు దఫాలు పార్టీ నేతలు, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు కోర్టును ఆశ్రయించటానికే మొగ్గుచూపారు. దీనికి అనుగుణంగానే గురువారం నాడు క్వాష్ పిటీషన్లు దాఖలు చేశారు. బుధవారం నాడు మాజీ మంత్రి నారాయణ నివాసాలు, కార్యాలయాలపై సీఐడీ సోదాలు కూడా నిర్వహించింది.

Next Story
Share it