కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరో సారి ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న మహానాడులో ఈ ఎన్నిక జరిగింది. ఈ పదవి కోసం ఒక్క చంద్రబాబు నాయుడే నామినేషన్ దాఖలు చేయటంతో ఈ ఎన్నిక ఇంచార్జి గా ఉన్న పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బుధవారం సాయంత్రం చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రతి రెండేళ్లకు ఒక సారి టీడీపీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది అనే విషయం తెలిసిందే. మహానాడు వేదికగాపైనే చంద్రబాబు నాయుడు తో వర్ల రామయ్య పార్టీ ప్రెసిడెంట్ ప్రమాణం చేయించారు.
మరో సారి పార్టీ పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన చంద్రబాబుకు మంత్రులు, పార్టీ నేతలు అందరూ అభినందనలు తెలిపారు. మరో సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుంది తెలిపారు. తెలుగు వాళ్ళను దేశంలో అగ్రగామిగా నిలబెట్టే శక్తి ఉన్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమే అని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే నలభై ఏళ్లకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.