Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఒక్క ఛాన్స్అంటే ..చివరి ఛాన్స్ అంటున్న చంద్రబాబు!

జగన్ ఒక్క ఛాన్స్అంటే ..చివరి ఛాన్స్ అంటున్న చంద్రబాబు!
X

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు ప్రతి సారి ఒక సెంటిమెంట్ డైలాగు కావాలా?. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వాడిన ఒక్క ఛాన్స్ బాగానే పనిచేసింది. పాదయాత్ర తో పాటు ఈ ఒక్క ఛాన్స్ నినాదం కలిసి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం జగన్ పాలన గతంలో ప్రజలు ఎప్పుడు చూడలేదు కాబట్టి ..ఇది పని చేసింది. ఈ సారి ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రజలు జగన్ పాలన చూసి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎలాగైనా మరో సారి అధికారంలోకి రావాలని తహతహ లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ఇవే నాకు చివరి ఎన్నికల వ్యాఖలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు చెప్పుకుంటే తన గత పాలన, తన అభివృద్ధి మోడల్ చెప్పుకొని ఓట్లు అడగాలి. తన పాలన జగన్ పాలనకు ఎలా బిన్నమైనదో ప్రజలకు చెప్పాలి. అదే సమయంలో వైసీపీ తప్పులను ఎత్తిచూపాలి. కానీ చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు ఓట్లు వేస్తారా లేదా అన్నది మీ ఇష్టం అంటూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రాన్ని వాడాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా కాదా అన్నది వేచిచుడాల్సిందే. చంద్రబాబు మాటలను అధికార వైసీపీ అస్త్రాలుగా చేసుకుని ఎటాక్ చేస్తోంది. మంత్రులు అంతా రంగంలోకి దిగి చంద్రబాబు కే కాదు..టీడీపీ కి కూడా ఇవే చివరి ఎన్నికలు అంటూ ఎటాక్ స్టార్ట్ చేశారు. నిజానికి బుధవారం నాటి చంద్రబాబు కర్నూలు పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సభల్లో సీఎం జగన్ పై చంద్రబాబు దావూద్ ఇబ్రహీంను మించిపోయారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇవే చివరి ఎన్నికలు అనటం తో కొంత డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది అనే అభిప్రాయం కొంత మంది టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న విషయం తెలిసిందే.

Next Story
Share it