Telugu Gateway
Andhra Pradesh

సెకీ విషయం ఎప్పుడో తెలిసినా నిన్నటి వరకు చంద్రబాబు, కేశవ్ మౌనం!

సెకీ  విషయం ఎప్పుడో తెలిసినా నిన్నటి వరకు చంద్రబాబు, కేశవ్ మౌనం!
X

అమెరికా కోర్టు లో కేసు నమోదు తర్వాత హడావుడి!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల వైపా..పారిశ్రామికవేత్తల వైపా?. అంటే చంద్రబాబు ఫస్ట్ ప్రాధాన్యత రెండవ వైపే...అంటే పారిశ్రామికవేత్తల వైపే ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు దెబ్బ తగిలినా ఒకే కానీ..పారిశ్రామిక వేత్తలకు దెబ్బ తగిలితే ఆయన తట్టుకోలేరు అన్నది అందరూ చెప్పే మాట. దీనికి ప్రధాన కారణం ఆయన ఎప్పుడూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వైపే ఉంటారు. ప్రతిపక్షంలో ఉంటే ఏ అంశంపై గగ్గోలు పెడతారో...దేనిపై అయితే పోరాటం చేస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు. మధ్యలో ఎవరైనా ఆ విషయాలు గుర్తు చేసినా పెట్టుబడి వాతావరణం దెబ్బతినకుండా చూడాలి...న్యాయపరంగా అన్ని అవకాశాలు పరిశీలించాలి అంటూ చెప్పుకొస్తారు. ఇప్పుడు అమెరికా కోర్టు వెలుగులోకి తెచ్చిన అదానీ-జగన్ డీల్ విషయం ఏమైనా కొత్తగా వచ్చిందా అంటే ఏ మాత్రం కాదు అనే చెప్పొచ్చు. అంతే కాదు...ఇదే టీడీపీ...టీడీపీ తరపున ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ఆర్థిక మంత్రి..అప్పటి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ నానా హంగామా చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు కానీ...అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ కానీ ఈ విషయంలో నోరు తెరిచిమాట్లాడలేదు. ఇప్పుడు అమెరికాలో అదానీ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు కావటంతో ఇప్పుడేదో ఈ విషయం కొత్తగా వెలుగులోకి వచ్చినట్లు స్పందింస్తున్నారు. ఇదే చంద్రబాబు సెకీ, అదానీ పవర్ ఒప్పందం వల్ల వినియోగదారులపై 62 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అని ప్రెజంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు. మరి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనాల వైపు నిలుస్తారా ...లేక జగన్-అదానీ డీల్ వైపా అన్నది వేచిచూడాల్సిందే. గత ప్రభుత్వంలో అంటే జగన్ హయాంలో సాగిన అక్రమాలు...స్కాం లకు సంబంధించిన విషయంలో తాము ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం తప్ప...ఎలాంటి యాక్షన్స్ ఉండవు అన్న చందంగా పలు విషయాల్లో కూటమి సర్కారు తీరు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే జగన్ తన ఐదేళ్ల పాలనలో తనకు అత్యంత సన్నిహితులు అయిన వాళ్లకు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు కట్టబెట్టారు. ఇవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలే. వీటి వైపు కూడా కూటమి సర్కారు అసలు కన్నెత్తి చూడకపోగా...జగన్ హయాంలో లబ్ది పొందిన కంపెనీలతో లాలూచి పడి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందారు అనే ప్రచారం టీడీపీ వర్గాల్లోనే ఉంది. నిజంగా అటు చంద్రబాబు, ఇటు కూటమిలో మరో కీలక భాగస్వామిగా..ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ లు ప్రజలపై అరవై వేల కోట్ల రూపాయల భారం పడకుండా చూస్తారా లేక మోడీ సన్నిహితుడిగా పేరున్న అదానీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారో చూడాలి. ఈ విషయంలో వీళ్ళ చిత్తశుద్ధి రాబోయే రోజులు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం, గగ్గోలు పెట్టడం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడుల వాతావరణం..ప్రాజెక్ట్ లు కూడా ముఖ్యం అంటూ కొత్త రాగాలు అందుకోవటం మాములు అయిపోయింది అనే విమర్శలు ఉన్నాయి.

Next Story
Share it