Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు చంద్రబాబు ఛాలెంజ్

జగన్ కు  చంద్రబాబు ఛాలెంజ్
X

అమరావతిలో నాకు ఇళ్లు లేదంటున్నారు

ఇళ్లు కట్టుకుని నువ్వు చేసిందేమిటి?

జగన్ కు నచ్చితే ముద్దులు..లేదంటే గుద్దులు

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై 18 నెలల్లో ఏమి చేశారు

మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. మూడు రాజధానులపై రిఫరెండం అందుకు ప్రజలు అంగీకరిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ఉద్యమం ఏడాది పూర్తి కావటంతో అమరావతి ప్రాంతంలో గురువారం నాడు బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో అధికార వైసీపీ, సీపీఎం మినహా అన్ని పార్టీల నేతలు పాల్గొని అమరావతికి మద్దతు ప్రకటించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న నేతలు 18 నెలలుగా ఏమి చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి విప్లవ వీరులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అన్నారని, ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని మండిపడ్డారు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ''జగన్ ఇష్టమొచ్చినప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులా. పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టి తీసుకొచ్చాం. ప్రధాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చారు. సాక్షాత్తు పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ప్రధాని చెప్పారు. జగన్ గాలి కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలి. అమరావతిలో నాకు ఇల్లు లేదంటున్నారు.. మీరు కట్టి ఏం పీకారు. ఒక కులంలో పుట్టడం నా తప్పా?. కులం చూసి హైదరాబాద్‌, విశాఖను అభివృద్ధి చేయలేదు. నా దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది'' అని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని పార్టీలు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇఫ్పటికైనా జగన్ తన మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకుని అమరావతిలోనే నిర్మాణాలు చేపట్టాలని కోరారు.

Next Story
Share it