Telugu Gateway
Andhra Pradesh

ఏఐ అంటే ఆయన చెప్పిందే వినాలి..చేయాలి

ఏఐ అంటే ఆయన చెప్పిందే వినాలి..చేయాలి
X

అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి రోబో లు మాత్రమే కావాలి. ఎవరూ సొంత బుర్ర వాడటానికి వీలు లేదు. ఆయన ఏది చెపితే అది చేయాలి..ఆయన చెప్పిన..తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించకూడదు. ఇదే ఆయన ఇప్పుడు అమలు చేస్తున్న మోడల్ అని తెలుగు దేశం పార్టీ కి చెందిన మంత్రులు...సీనియర్ ఎమ్మెల్యేలు కూడా చెపుతున్న మాట. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆయన ఏది చెపితే అదే చేసే వాళ్ళు మాత్రమే అని ఒక మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతే కానీ సొంత బుర్ర వాడి..సొంత నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి జీ వీ రెడ్డి లాగే ఉంటుంది అన్నారు. చంద్రబాబు ఇప్పుడు తన స్లోగన్ ను ఏఐ నుంచి మార్చుకుని రోబోటిక్ టెక్నాలజీ గురించి చెపితే సరిపోతుంది అంటూ కూడా టీడీపీ నేతలు చెపుతున్నారు.

ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడెక్కడ నుంచో డేటా...వివరాలు తీసుకువచ్చి కేసు ను పక్కా గా ప్రెజంట్ చేస్తే అప్పటికి అవి పర్ఫెక్ట్ గా వాడుకుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ కష్టం చేసిన వాళ్లను ...సొంత బుర్ర ఉన్న వాళ్ళను వెంటనే పక్కనపడేస్తారు. ఇలాంటి వారి సంఖ్య టీడీపీ లో ఎంత ఉంటుందో లెక్కే లేదు అనే చెప్పొచ్చు. ప్రతి పదేళ్లకు....ఐదేళ్లకు ఇలాంటి వాళ్ళు మారుతూనే ఉంటారు. ఎందుకంటే పని చేసిన వాళ్లకు కాకుండా పదవులు వేరే వాళ్ళకే ఇస్తారు కాబట్టి. తర్వాత వీళ్ళ స్థానంలో ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తారు. ఇది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు...టీడీపీ లో గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది అని ఒక సీనియర్ మంత్రి అన్నారు.

ఇలాంటి విషయాలు ఏమీ తెలియకుండా...జీ వీ రెడ్డి ఆవేశపడి అర్దాంతరంగా పార్టీ ని, పదవిని వీడాల్సి వచ్చింది అని చెప్పారు. జీ వీ రెడ్డి రాజీనామా వల్ల టీడీపీ కి ఏదో భారీ నష్టం జరిగిపోయింది అని ఎవరూ అనరు కానీ...ప్రజల్లోకి మాత్రం బలంగా ఒక ఫీలింగ్ మాత్రం వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు పని చేసే వాళ్ళను పట్టించుకోరు.కేవలం తన మాటకు...తన తనయుడు, మంత్రి నారా లోకేష్ ఏది చెపితే అది ఒకే అనే వాళ్లను తప్ప అనే సంకేతం మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.జీవీ రెడ్డి రాజీనామాతో ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ సీనియర్ నేతలు రాజీనామా చేసినా కూడా రానంత రియాక్షన్ వచ్చింది.

దీంతోనే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. ఇదే నిర్ణయం కాస్త ముందు తీసుకుని ఉంటే..ఆ తర్వాత జీ వి రెడ్డి రాజీనామా చేస్తే ఆ వ్యతిరేకత ఆయనపైకి వెళ్ళేది. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉండగా పలు అంశాలపై గట్టిగా మాట్లాడిన జీ వి రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు సరిగా వ్యవహరించలేదు అనే ఫీలింగ్ ఎక్కువ మంది నేతల్లో ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో అయినా దిద్దు బాటు చర్యలు తీసుకుంటారా లేక అంతా మా ఇష్టం అన్న ధోరణినే కొనసాగిస్తారా అన్నది చూడాలి.

Next Story
Share it