Telugu Gateway
Andhra Pradesh

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ధర్నా

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ధర్నా
X

'పధ్నాలుగు సంవత్సరాలు సీఎంని. ప్రతిపక్ష నాయకుడిని. నన్ను ఎందుకు అడ్డుకున్నారు. ఇదేంటి. నాకెందుకు ఇచ్చారు నోటీసు . నేను రావటానికి కూడా పర్మిషన్ కావాలా?.' అంటూ చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో పోలీసు అధికారులపై మండిపడ్డారు. నిరసనకు అనుమతి లేదంటే కలెక్టర్, ఎస్పీని ఇక్కడకు రమ్మనండి అని చంద్రబాబు కోరటంతో సమాచారం వారిద్దరి పంపుతామని పోలీసులు తెలిపారు. తాను ఇక్కడే నిరసన తెలియజేస్తానని అంటూ చంద్రబాబు విమానాశ్రయంలో లోపలే కింద కూర్చున్నారు. పోలీసులు వద్దని వారించినా ఆయన నిరసనకు దిగారు.

నేను ఎందుకు వచ్చానో చెప్పాలి కదా...అరెస్ట్ చేస్తే చేసుకోండి. కొట్టేయండి లేకపోతే. ఏమిటీ దౌర్జన్యం. ఫండమెంటల్ రైట్ లేదా నాకు. కలెక్టర్ ను కలవటానికి. ఈ దేశంలో ఏమైంది.. నేను ఏమైనా హత్యకు పోతున్నానా?. ఏమి తమాషాలు పడుతున్నారు మీరు. ఎందుకు డిటైన్ చేశారు చెప్పండి. నువ్వు పరిష్మన్ ఇవ్వలేదు. నేను ఎస్పీ దగ్గరకుపోతాను. నేను ఇక్కడే కూర్చుంటా అంటూ కింద నేలపై నిరసనకు దిగారు. పోలీసులు కుర్చీ తీసుకొచ్చి వేసినా చంద్రబాబు నేలపై కూర్చుని తన నిరసన తెలియజేశారు. ఈ సమయంలో చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు.

Next Story
Share it