Telugu Gateway
Andhra Pradesh

లోక్ స‌భ‌లో వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌

లోక్ స‌భ‌లో వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌
X

జ‌ల వివాదానికి సంబంధించిన అంశాన్ని అధికార వైసీపీ ఎంపీలు గురువారంనాడు పార్ల‌మెంట్ లో లేవ‌నెత్తారు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని లేఖ‌లు రాసినా కూడా తెలంగాణ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంద‌ని.దీని వ‌ల్ల ఏపీతోపాటు రాబోయే రోజుల్లో చెన్న‌య్ కు కూడా తాగు నీటి స‌మ‌స్య వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంద‌న్నారు. తెలంగాణ ఎన్నో అక్ర‌మ ప్రాజెక్టులను క‌డుతోకడుతోంద‌ని విమ‌ర్శించారు. విభజన చట్టానికి భిన్నంగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న.. తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాల‌ని కోరారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

అవినాష్ రెడ్డి తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి అంశంతోపాటు గెజిట్ నోటిఫికేష‌న్ అంశాన్ని ప్ర‌స్తావించారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్‌ సమాధానం ఇస్తూ ఇరు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకే గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చామ‌ని తెలిపారు. జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తిపై కెఆర్ ఎంబీకి లేఖ‌లు వ‌చ్చాయ‌ని..విద్యుత్ ఉత్ప‌త్తి ఆపాల‌ని చెప్పినా తెలంగాణ ఆప‌లేద‌ని..మ‌రోసారి ఈ అంశాన్నితెలంగాణ కు చెబుతామ‌న్నారు. దీంతోపాటు పోల‌వరం స‌వ‌రించిన అంచ‌నాల‌కు ఆమోదం తెలపాలంటూ వైసీపీ ఎంపీలు స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీల ఆందోళ‌న‌తో పార్ల‌మెంట్ వాయిదాల మీద వాయిదాలు ప‌డుతోంది.

Next Story
Share it