ఏపీ సీఎం జగన్ తో కిషన్ రెడ్డి భేటీ
BY Admin19 Aug 2021 2:27 PM

X
Admin19 Aug 2021 2:27 PM
ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అంతకు ముందు ఆయన తిరుమలలో వెంకటేశ్వరస్వామిని సందర్శించుకున్నారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని కూడా సందర్శించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో మర్యాదపూర్వక భేటీ సాగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, ఆయన సతీమణి భారతి సన్మానించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది.
Next Story