Telugu Gateway
Andhra Pradesh

ఈ ప్రయత్నం ఫలిస్తుందా?

ఈ ప్రయత్నం ఫలిస్తుందా?
X

.ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వై ఎస్ షర్మిల ఇప్పుడు ఒక కీలక నేతగా మారారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది అన్నది ఎన్నికలు పూర్తి అయితే కానీ తేలదు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై చేస్తున్న ఎటాక్ ఆ పార్టీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిజంగా అలాంటిది ఏమి లేకపోతే సోషల్ మీడియా లోనూ..బయట కూడా అధికార పార్టీ వైసీపీ షర్మిలపై ఇంతగా దాడి చేయదు అనే విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా ఎంత దాడి చేసినా సరే షర్మిల మాత్రం ఏ మాత్రం వెరవకుండా ముందుకే సాగుతున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీడియా అంతా తొలుత షర్మిలకు పెద్ద ఎత్తున కవరేజ్ దక్కింది. ఇది రాజకీయంగా తమను ఇబ్బందికి గురి చేస్తుంది అని బయపడ్డవారు కొద్ది రోజుల క్రితం కొన్ని కీలక చానళ్లకు ఫోన్లు చేసి మరీ షర్మిల కవరేజ్ పై సెన్సార్ షిప్ విధించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎవరు అయితే తమ చెప్పు చేతల్లో ఉన్నారో...వాళ్లకు తాజాగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే ఇవి అందుకున్న వాళ్ళు కూడా పెద్దలు చెప్పిన మాటను తూచా తప్పకుండ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

వై ఎస్ షర్మిల కవరేజ్ పూర్తిగా ఎత్తేయటంతో పాటు ఆమె చేసే విమర్శలకు కౌంటర్లు మాత్రం ప్రసారం చేయాలని సదరు పెద్దలు కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వై ఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా జగన్ పై టీడీపీ, జనసేన కంటే ఎక్కువగా ఎటాక్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఆంధ్ర ప్రదేశ్ అన్యాయం చేసిన...ప్రత్యేక హోదా అమలు చేయని , పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వని బీజేపీకే ఊడిగం చేస్తున్నారు అని...ఏకంగా రాష్ట్రాన్ని బీజేపీకి బానిసగా మార్చారు అంటూ సంచనలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే షర్మిల పై సెన్సార్ వ్యవహారం ఎంత మేర వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. జగన్ ను వ్యతిరేకించే మీడియా అంతా షర్మిలకు మాత్రం పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తున్నాయి. షర్మిల సోమవారం నాడు ఇడుపుల పాయలో వై ఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో భేటీ కావటం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. సునీత కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it