సీఎం జగన్ పారిస్ టూర్ కు కోర్టు ఓకే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీబీఐ అభ్యంతరాలను తోసిపుచ్చి మరీ కోర్టు జగన్ వినతికి ఓకే చేసింది. సీఎం జగన్ తరచూ విదేశీ పర్యటనలు అనటం వల్ల కేసుల విచారణకు ఆటంకం కలుగుతుందని సీబీఐ తన కౌంటర్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. జూన్ 28 నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటనకు ఆమోదం లభించింది.
తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు.