Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు సీబీఐ కోర్టు నో

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు సీబీఐ కోర్టు నో
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డిల‌కు బిగ్ రిలీఫ్‌. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వీరి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ దాఖ‌లు చేసిన పిటీష‌న్ ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. దీంతో గ‌త కొన్ని నెల‌లుగా సాగుతున్న స‌స్పెన్స్ కు తెర‌ప‌డిన‌ట్లు అయింది. జ‌గ‌న్ సీఎం హోదాల‌తో త‌న కేసుల‌తో సంబంధం ఉన్న వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ బెయిల్ నిబంద‌న‌లు ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామ కృష్ణంరాజు బెయిల్ ర‌ద్దు చేయాంటూ పిటీస‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి త‌ర‌పు లాయ‌ర్లు కేవ‌లం రాజ‌కీయ దురుద్దేశాల‌తోనే ర‌ఘురామ‌క్రిష్ణంరాజు బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ దాఖ‌లు చేశార‌ని..వీరు ఎక్క‌డా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేద‌న్నారు. వీరి వాద‌న‌తోనే కోర్టు ఏకీభ‌వించిన‌ట్లు తాజా తీర్పుతో తేలిపోయింది.

రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండాత‌ప్పించుకుంటున్నార‌ని అన్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు. రెండూ ఒకే త‌ర‌హా పిటీష‌న్లు కావ‌టంతో..రెండంటిపై ఒకేసారి తీర్పు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సీబీఐ కోర్టు బుధ‌వారం నాడు తుది తీర్పు వెలువ‌రించింది.

Next Story
Share it