Telugu Gateway
Andhra Pradesh

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు
X

టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పోలీసులను అభ్యంతరకర భాషలో దూషించారనే అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. పెదపప్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వి ఎన్ కె చైతన్య వెల్లడించారు. జె సీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి పోలీసులు పెడుతున్న అక్రమ కేసులకు నిరసనగా నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించటంతో పోలీసులు తాడిపత్రలో 144 సెక్షన్ పెట్టడంతోపాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

ఆ సమయంలోనే కొంత మంది పోలీసులు జె సీ దివాకర్ రెడ్డి ఫాంహౌస్ లోని ఆయన గదిలోకి వెళ్లారు. ఆ సమయంలోనే దివాకర్ రెడ్డి అభ్యంతరకర భాష ఉపయోగించారు. అందుకే పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో సెక్షన్ 353, 506 ల కింద కేసు పెట్టారు. గత కొన్ని రోజులుగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జె సీ ఫ్యామిలీ మధ్య రాజకీయ వార్ జరుగుతోంది.

Next Story
Share it