Telugu Gateway
Andhra Pradesh

అల్లుడిని నరికి చంపిన మామ

అల్లుడిని నరికి చంపిన మామ
X

హత్యలు...దారుణ హత్యలు. ఈ మధ్య దారుణ హత్యలు పెరిగిపోతున్నాయి. సినిమాల్లో హీరోలు విలన్ల తల నరికినత ఈజీగా బయటకూడా ముర్డర్లు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో మర్డర్ ఎంత దారుణంగా జరిగిందో అందరూ చూశారు. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా ప్రకంపనలు రేపింది. ఎందుకంటే హత్య చేయటమే కాకుండా శరీర భాగాలను కూడా విడదీసి మరి పైశాచికంగా ఈ పనిచేశాడు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

పట్టపగలే మామ ఏకంగా అల్లుడిని నరికి చంపేశాడు. దేవనకొండ మండలం పీ కోటకొండ లో జాతర జరుగుతున్న వేళ ఈ హత్య జరిగింది. సూర్య ప్రకాష్ వయస్సు 23 సంవత్సరాలే. ఇతగాడి మామ లింగమయ్య పథకం ప్రకారం కత్తులు సిద్ధంచేసుకుని దాడి చేశాడు. దీంతో అక్కడికి అక్కడే సూర్యప్రకాష్ కుప్పకూలి చనిపోయాడు. కుటుంబ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు చెపుతున్నారు. ఎన్ని గొడవలు ఉన్నా కూడా మామ స్వయంగా 23 సంవత్సరాల అల్లుడిని చంపటం ఏమిటి అని గ్రామస్థులు మండిపడుతున్నారు. పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

.

Next Story
Share it